1000 పాయింట్లకు పడిపోయిన సెన్సెక్స్.. ! 24 d ago
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఉదయం లాభాలలో ప్రారంభమైన సూచీలు ఐటీ స్టాక్స్ లో అమ్మకాల ఒత్తిడితో భారీ నష్టం లోకి జారుకున్నాయి. దీంతో సెన్సెక్స్ 1000 పాయింట్లకు పైగా నష్టపోగా నిఫ్టీ 24000 దిగవన ట్రేడ్ అవుతుంది. 1.20 గంటలకు సెన్సెక్స్ 1007.09 పాయింట్ల నష్టంతో 79,226.99 వద్ద ట్రేడ్ అవుతుండగా... నిఫ్టీ సైతం 297.30 వద్ద పాయింట్ల నష్టంతో23,977.60 వద్ద కొనసాగుతోంది.